¡Sorpréndeme!

PBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

2025-04-16 0 Dailymotion

 క్రికెట్ అంటేనే అంత..ఐపీఎల్ లో అయితే మరీ..థ్రిల్లర్ సినిమాలకు అంతూ పొంతూ ఉండదు. కానీ నిన్న కేకేఆర్ తో పంజాబ్ కు జరిగిన మ్యాచ్ మాత్రం దిజ్ ఈజ్ సినిమా మూమెంట్. అసలు 111 పరుగులు మాత్రమే కొట్టడేంటీ..కోల్ కతా కు ఉన్న బ్యాటింగ్ కు లైనప్ కు ఆ టీమ్ ఇరగదీస్తది ఉఫ్ మని 10 ఓవర్లలో ఊదేస్తుంది అనుకుంటే 95 పరుగులకే కోల్ కతా కుప్పకూలటం ఏంటీ..అంతా మ్యాజిక్ కాకపోతే. కానీ హ్యాట్సాఫ్ టూ పంజాబ్ కింగ్స్. వాళ్ల ధైర్యానికి, పోరాటానికి మెచ్చుకోవాల్సిందే. అంత తక్కువ స్కోరు పెట్టి చరిత్రలో మునుపెన్నడుూ లేని విధంగా మ్యాచ్ ను కాపాడుకుంది పంజాబ్. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే పంజాబ్ గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 245 పరుగులు కొట్టింది. అది పంజాబ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్. అలాంటిది అంత భారీ స్కోరు కొట్టినా కూడా అభిషేక్ శర్మ విధ్వంసంతో ఆ మ్యాచ్ చేజారిపోయింది. భారీ సెంచరీతో పంజాబ్ హయ్యెస్ట్ స్కోరు రికార్డుకు అఱ్థం లేకుండా చేసేశాడు అభిషేక్. అలా అత్యధిక పరుగుల మ్యాచ్ చేజారిపోయిన నెక్ట్స్ మ్యాచ్ లోనే కోల్ కతాపై 111 కే పరుగులకే కుదేలవటం...అత్యద్భుతమైన పోరాటంతో కేకేఆర్ ను 95 పరుగులకే కుప్ప కూల్చి అతి తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకున్న టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప రికార్డును నెలకొల్పింది. ఈ రెండు భారీ వేరియేషన్స్ తన వరుస రెండు మ్యాచుల్లో పంజాబ్ చేసి చూపించటం నిజంగా అద్భుతం, ఓ వింత అనే చెప్పాలి. ఇక్కడే ఇంకో విశేషం కూడా చెప్పనా ఇదే పంజాబ్ లాస్ట్ ఇయర్ ఇదే కేకేఆర్ పై 262 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టార్గెట్ ఛేజ్ చేసిన టీమ్ గా రికార్డు సృష్టించింది. మళ్లీ ఏడాది తర్వాత అదే కోల్ కతాపై లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసుకుంది.  సో ఛేజింగ్ పంజాబే..డిఫెండింగు పంజాబే. రెండు సార్లు బలయ్యింది మాత్రం కేకేఆరే.